: గుజరాత్ లో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లపై నిషేధం ఎత్తివేత
తమను ఓబీసీ కోటాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ యువనేత హార్ధిక్ పటేల్ ఆధ్వర్యంలో గుజరాత్ లోని పటేళ్లు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలు తీవ్రరూపం దాల్చి, హింసాత్మకంగా మారాయి. వాట్స్ యాప్, ఫేస్ బుక్ లాంటి సామాజిక అనుసంధాన సైట్ల ద్వారా సమాచారాన్ని చేరవేసుకుంటున్నారన్న సమాచారంతో... సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లపై గుజరాత్ ప్రభుత్వం నిషేధం విధించింది. గత రెండు రోజులుగా పరిస్థితి అదుపులోకి రావడంతో, వీటిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.