: రోజూ మీకు ఇదే పనా?: స్పీకర్ కోడెల
అసెంబ్లీ లాబీలో దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ఫొటోను తొలగించడాన్ని నిరసిస్తూ వైకాపా సభ్యులు ప్లకార్డులు, ఫొటోలతో శాసనసభలో నిరసన తెలిపారు. వైయస్ ఫొటోను యథాస్థానంలో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైకాపా సభ్యుల తీరును స్పీకర్ కోడెల శివప్రసాదరావు తప్పుబట్టారు. ప్రతిరోజూ ఇదే పనేంటి మీకు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులు, ఫొటోలను పక్కనబెట్టి సభ సాంప్రదాయాలను పాటించాలని సూచించారు. ఈ క్రమంలో, సభను 10 నిమిషాల పాటు స్పీకర్ వాయిదా వేశారు.