: గూగుల్ తప్పు చేస్తోందా?
తమ కంపెనీల విషయాలను ప్రముఖ సర్చ్ ఇంజిన్ గూగుల్ తక్కువ చేసి చూపుతోందని అమెరికా, యూరప్ ఖండాల్లోని పలు సంస్థలు మండిపడుతున్నాయి. అంతేకాకుండా, గూగుల్ పై ఫిర్యాదులు కూడా చేస్తున్నాయి. మన దేశంలో కూడా ఇదే తరహా అభ్యంతరాలు తలెత్తుతున్నాయి. సంస్థల లావాదేవీలు, సేవల వివరాలు, ఆన్ లైన్ ప్రకటనల ర్యాంకింగ్స్ తదితర వివరాలను గూగుల్ తప్పుగా చూపిస్తోందనేది ఆ సంస్థపై వస్తున్న ప్రధాన ఆరోపణ. తమ సేవలను తక్కువ చేసి చూపిస్తుండటంతో, తమ మార్కెట్ దెబ్బతింటోందని పలు సంస్థలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో, 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా'కు చెందిన నిఘా విభాగం గూగుల్ వివరణ కోరింది.