: చర్చలకు తెలంగాణ ప్రభుత్వం రాకపోవటం వల్లే సమస్యలు పరిష్కారం కావట్లేదు: మంత్రి యనమల
తెలంగాణ ప్రభుత్వం చర్చలకు రాకపోవటం వల్లే సమస్యలు పరిష్కారం కావట్లేదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికే షీలా బేడీ కమిటీని కోరామని చెప్పారు. కేంద్రం జోక్యం చేసుకుని ఇరు రాష్ట్రాల సమస్యలు కూడా పరిష్కారించాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో ఈరోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా యనమల మాట్లాడుతూ, అసలు రాష్ట్ర విభజన చట్టంలోనే లోపాలున్నాయని అన్నారు. అన్ని లోపాలను సరిచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.