: ఒక్కసారి అప్లై చేస్తే... అన్నింటికీ చేసినట్లే! వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కు టీఎస్పీఎస్సీ శ్రీకారం
కొత్త రాష్ట్రం తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి తెరలేపిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం నిరుద్యోగులకు వరమేనని చెప్పాలి. ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ పేరిట నిన్న టీఎస్పీఎస్సీ ప్రారంభించిన ఈ విధానంతో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి, ఒకే ఒక్కసారి తన పూర్తి వివరాలతో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. సదరు అభ్యర్థి విద్యార్హతలకు సరిపోలే భవిష్యత్ ఉద్యోగాల సమాచారం నేరుగా అతడి మొబైల్ కు చేరిపోతుంది. సదరు మెసేజ్ లతో అభ్యర్థి కేవలం రెండే రెండు కాలమ్స్ పూక్తి చేసి, నిర్దేశిత ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఈ విధానంలో తొలుత దరఖాస్తు చేసుకునే సమయంలో ‘ఎనీ జాబ్స్’ ఆప్షన్ ను ఎంచుకుంటే చాలని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేయగానే, సదరు అభ్యర్థి మొబైల్ కు టీఎస్పీఎస్సీ నుంచి పది అంకెలతో కూడిన పాస్ వర్డ్ తో పాటు టీఎస్పీఎస్సీ ఐడీ నెంబరు వచ్చేస్తాయి. ఆ తర్వాత వచ్చే నోటిఫికేషన్లన్నింటికీ ఈ ఐడీతో పాటు డేట్ ఆఫ్ బర్త్ కాలం పూరిస్తే సరిపోతుంది.