: ఆ భయమే లేకుంటే, పాకిస్థాన్ ఎప్పుడో పెను విధ్వంసం సృష్టించేదే!


ఇండియాపై భారీ ఎత్తున దాడులు జరిపి పెను విధ్వంసం సృష్టించాలని చూసే ఉగ్ర సంస్థలకు కొమ్ముకాస్తూ, వాటికి అవసరమైన నిధులను స్వయంగా ప్రభుత్వమే ఇస్తోందని, అమెరికాకు చెందిన సీఐఏ పత్రాలు వెల్లడిస్తున్నాయి. గతంలో ఇండియాలో జరిగిన దాడుల వెనుక పాక్ హస్తం ఉందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, హర్కత్ ఉల్ అన్సార్, లష్కరే తోయిబా వంటి సంస్థలకు నిధులందించిందని సీఐఏ వెల్లడించింది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ వీటికి భారీ ఎత్తున నిధులిస్తున్నట్టు తమ వద్ద సమాచారం ఉందని, ఇలాగే కొనసాగితే, ఉగ్ర దేశాల జాబితాలో పాక్ ను చేరుస్తామని యూఎస్ హెచ్చరించడంతో, ఆ దేశం కాస్తంత వెనకడుగు వేసింది. ఇండియా నుంచి వెళ్లే విమానాలపైనా దాడులు చేసేందుకు పాక్ కుట్ర చేసినట్టు సీఐఏ పత్రాలు తెలియజేస్తున్నాయి. అమెరికా నుంచి వచ్చే నిధులు ఆగుతాయన్న భయాలే లేకుంటే, పాక్ ఏనాడో పెను విధ్వంసానికి కారణమై ఉండేదేమో! ఆ భయమే పాక్ దూకుడుకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తోంది.

  • Loading...

More Telugu News