: మీ అసెంబ్లీలో మా ఊసెందుకు?... ఇకపై సహించేది లేదంటున్న టీఆర్ఎస్ నేతలు


ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మంత్రుల పేర్లను ప్రస్తావించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు, ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఏపీ అసెంబ్లీలో తమ పార్టీ అధినేత, మంత్రుల పేర్లను ప్రస్తావిస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. ఏపీ ప్రయోజనాలను పక్కనబెట్టిన చంద్రబాబు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నారని వారు ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ముమ్మాటికీ దొంగేనని తేల్చిచెప్పారు. చంద్రబాబు తీరుపై ఏపీ ప్రజలకు అసహ్యం కలుగుతోందని ఆరోపించిన వారు, జగన్ సవాళ్లకు సమాధానం చెప్పలేకనే చంద్రబాబు తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు రేవంత్ రెడ్డిని ఆయన సొంత నియోజకవర్గం కొడంగల్ కు పరిమితం చేసిన మాదిరిగానే చంద్రబాబును కూడా కుప్పంకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News