: అభిమానులకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజున, ఆయన అభిమానులకు మంచి కానుక లభించింది. పవన్ తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజరును మంగళవారం అర్ధరాత్రి చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో దీన్ని చూసిన వారి సంఖ్య గంటల వ్యవధిలో వేలు దాటి లక్షల్లోకి చేరింది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ఈ టీజరులో ఓ మాస్ పోలీస్ ఆఫీసర్ గా పవన్ కల్యాణ్ కనిపిస్తున్నాడు. గబ్బర్ సింగ్ సినిమాలో మాదిరిగానే గుర్రాన్ని నడిపిస్తూ, అభిమానులను ఎంతో ఆకర్షించేలా న్యూ లుక్ తో అదరహో అనిపిస్తున్నాడు.