: వైఎస్ చిత్రపటాలు చేతబట్టిన వైసీపీ నేతలు... స్పీకర్ పోడియం ముట్టడి
ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మొన్నటిదాకా ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటం తొలగింపుపై వైసీపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైఎస్ చిత్ర పటాలున్న ప్లకార్డులు చేతబట్టిన వైసీపీ నేతలు, వైఎస్ చిత్ర పటాన్ని తొలగించడంపై నిరసన తెలుపుతున్నారు. తక్షణమే వైఎస్ చిత్రపటాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైసీపీ నేతలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.