: సమ్మె ప్రారంభం... దేశవ్యాప్తంగా స్తంభించిన రవాణా వ్యవస్థ


పలు డిమాండ్ల సాధన కోసం కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన దేశవ్యాప్త సమ్మె ప్రారంభమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘాలు మినహా దాదాపుగా అన్ని జాతీయ కార్మిక సంఘాలు, వాటి అనుబంధ శాఖలు సమ్మెలో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. వాణిజ్య కార్యకలాపాలు కూడా స్తంభించనున్నాయి. బ్యాంకులు కూడా మూతపడనున్నాయి. సమ్మెకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే, లారీ, ఆర్టీసీ, ఆటో కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నేడు తెలుగు రాష్ట్రాల్లో అన్ని కార్యకలాపాలు పూర్తిగా స్తంభించనున్నాయి.

  • Loading...

More Telugu News