: ప్రజలు కోరుకుంటే ఆలోచించి చెబుతా: గద్దర్


రాజీకీయ రంగ ప్రవేశం గురించి ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ స్పందించారు. లెఫ్ట్ పార్టీల నేతలు తనను కలిశారని గద్దర్ వెల్లడించారు. తన రాజకీయ రంగప్రవేశాన్ని కాలమే నిర్ణయిస్తుందని గద్దర్ తెలిపారు. దీనిపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచిస్తానని గద్దర్ స్పష్టం చేశారు. కాగా, హైదరాబాదులోని మఖ్దూం భవన్ లో సీపీఐ ఆధ్వర్యంలోని వామపక్షాలకు చెందిన పది పార్టీల నేతలు సమావేశమై వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉపఎన్నికలో గద్దర్ ను నిలబెట్టాలని నిర్ణయించారు. గద్దర్ ను ఒప్పించే బాధ్యతను పార్టీల నాయకులు తీసుకున్నారు. అనంతరం అంతా కలిసి గద్దర్ ను కలిశారు.

  • Loading...

More Telugu News