: ఏపీ అటవీ శాఖలో లంచావతారం... రూ.1.65 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం


నిన్నటిదాకా తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ లంచావతారాలపై ముప్పేట దాడులు చేసింది. పెద్ద సంఖ్యలో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసి కటకటాల వెనక్కు పంపింది. తాజాగా ఏపీ అవినీతి నిరోధక శాఖాధికారులు కూడా రంగంలోకి దిగారు. పశ్చిమగోదావరి జిల్లాలో అటవీ శాఖ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న నాగేశ్వరరావుపై దాడి చేశారు. జిల్లాలోని గోపాలపురం మండలం దొండపూడి వద్ద కలప స్మగ్లర్ల నుంచి నాగేశ్వరరావు రూ.1.65 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News