: ఇషాంత్ శర్మపై టెస్టు మ్యాచ్ నిషేధం... చండీమాల్, దమ్మిక, తిరిమన్నెలపైనా ఐసీసీ చర్యలు
కొలంబో టెస్టులో మాటల తూటాలు పేల్చుకున్న ఇషాంత్ శర్మ, ముగ్గురు లంక క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చర్యలకు ఉపక్రమించింది. మ్యాచ్ లో భాగంగా ఇషాంత్, చండీమాల్ పై నోరు పారేసుకున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇషాంత్ తో దమ్మిక ప్రసాద్, తిరిమన్నెలు కూడా వాగ్వాదానికి దిగారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన ఐసీసీ కొద్దిసేపటి క్రితం వారిపై చర్యలు తీసుకుంంది. ఇషాంత్ శర్మపై ఒక టెస్టు నిషేధం విధించిన ఐసీసీ, దినేశ్ చండీమాల్ పై ఒక వన్డే నిషేధం విధించింది. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టుకు ఇషాంత్ శర్మ దూరం కానున్నాడు. ఇక దమ్మిక ప్రసాద్, తిరిమన్నెల మ్యాచ్ ఫీజులో 50 శాతానికి కోత పెడుతూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.