: క్రూరమైన హత్య తాలూకు వీడియో విడుదల చేసిన ఐఎస్ఐఎస్


మత సామ్రాజ్య విస్తరణ పిచ్చితో ఐఎస్ఐఎస్ ముష్కరులు పేట్రేగిపోతున్నారు. తమ మతగ్రంథాల్లో పేర్కొన్న విధంగా నరలోక శిక్షలు అమలు చేయడంలో ఐఎస్ఐఎస్ ను మించిన వారు లేరనడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది. తాజాగా ఐఎస్ఐఎస్ అత్యంత క్రూరమైన శిక్షను అమలు చేసిన వీడియో విడుదల చేసి కలకలం రేపింది. గూఢచర్యం చేస్తున్నారన్న నెపంతో నలుగురు ఇరాకీలను తల్లకిందులుగా వేలాడదీసిన ఐఎస్ఐఎస్ ముష్కరులు, సినిమాల్లో చూపించినట్టు వారి కింద పెట్రోల్ ధారలు ఏర్పాటు చేశారు. ఈ ధారలకు నిప్పంటించిన ఐఎస్ఐఎస్ మృగాలు ఆ నలుగురూ మంటల్లో మాడిమసైపోతుండగా చూసి సంతోషించారు. అలా చేయడానికి ముందు నిందితులు నలుగురికీ గతంలో ఐఎస్ఐఎస్ చేసిన హత్యల తాలూకు వీడియోలు చూపించి భయబ్రాంతులను చేశారు. అనంతరం వారు ఎక్కడి వారు? ఎలా వచ్చారు? వంటివి వారితోనే చెప్పించి, వారిని అత్యంత పాశవికంగా దహనం చేసి చంపేశారు.

  • Loading...

More Telugu News