: హత్యలు, ఫ్యాక్షన్ వైఎస్ ఫ్యామిలీ పేటెంట్లు... జగన్ పై ‘పల్లె’ ఫైర్
వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫైరయ్యారు. అసెంబ్లీలో ఏ ఒక్క అంశంపై కూడా పూర్తి స్థాయి చర్చ జరగకపోవడానికి జగనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా పల్లె పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హత్యలు, ఫ్యాక్షనిజం వైఎస్ ఫ్యామిలీకి పేటెంట్ హక్కులని పల్లె ఆరోపించారు. అసెంబ్లీలోనూ జగన్ ఫ్యాక్షనిస్ట్ లానే వ్యవహరిస్తున్నారన్నారు. చట్టాలు, అసెంబ్లీ అంటే జగన్ కు గౌరవం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పేరిట తన పార్టీని నిలబెట్టుకునేందుకు జగన్ యత్నిస్తున్నారన్నారు. ప్రత్యేెక హోదా సాధన కోసం జగన్ డెడ్ లైన్ పెట్టడం సరికాదని ఆయన అన్నారు.