: కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హరీష్ రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జోగు రామన్న, పద్మారావులతో వరంగల్ లో సుడిగాలి పర్యటన నిర్వహించిన సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, కిషన్ రెడ్డి ఆంధ్రా నాయకత్వం చేతిలో కీలు బొమ్మగా మారారని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి తీరు వల్లే బీజేపీ నుంచి వలసలు పెరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ అయితే తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని ఆయన సూచించారు. తోటపల్లి రిజర్వాయర్ ను కాంగ్రెస్ నేతలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్రం నుంచి తెలంగాణకు సహకారం అందడం లేదని, దానిపై కిషన్ రెడ్డి పోరాడాలని ఆయన సూచించారు.