: తెలుగు రాష్ట్రాల్లో నేటి అర్ధరాత్రి నుంచి స్తంభించనున్న రవాణా వ్యవస్థ


కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందంటూ దేశ వ్యాప్త బంద్ కు కార్మిక, ఉద్యోగ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కు లారీ ఓనర్ల అసోసియేషన్, ఆటో కార్మిక సంఘాలు మద్దతివ్వడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థ స్తంభించనుంది. కార్మిక వ్యతిరేక విధానాలు, రహదారి రవాణా భద్రత బిల్లు ఉపసంహరించుకోవాలని, కార్మికుల కనీస వేతనాలు 15 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మిక, ఉద్యోగ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో రైల్వేల్లో ఎఫ్డీఐ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైల్వే మజ్దూర్ యూనియన్, రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కూడా మద్దతు తెలిపాయి. సమ్మెలో భాగంగా ఆటోడ్రైవర్లు భాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపార్కు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News