: వరంగల్ ఉప ఎన్నికల్లో వామ పక్షాల తరపున గద్దర్?
వరంగల్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ ను పోటీకి నిలబెట్టాలని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ పార్టీ ప్రధాన కార్యాలయంలో వామపక్షాలకు చెందిన పది పార్టీలు సమావేశమయ్యాయి. సమావేశంలో వరంగల్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో గద్దర్ ను నిలబెట్టాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. గద్దర్ ను నిలబెడితే విజయం సాధిస్తామని వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ పోరాటంలో గద్దర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్న పార్టీలు ఆయనను వామపక్ష పార్టీల అభ్యర్థిగా బరిలోకి దించనున్నాయి. అదే జరిగితే వరంగల్ ఉప ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.