: ఉగ్రదాడులు జరగొచ్చంటూ హెచ్చరిక... ఆంక్షలు విధించిన సైబరాబాద్ కమిషనర్
ఉగ్రవాదులు దాడులు జరపచ్చంటూ నిఘావర్గాలు అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశాయి. గాలిలో ఎగిరే రిమోట్ కంట్రోల్ పరికరాల ద్వారా దాడులు జరగవచ్చని హెచ్చరించారు. రిమోట్ కంట్రోల్ విమానాలు, డ్రోన్ లతో దాడులు చేసే ప్రమాదం ఉందని నిఘావర్గాలు తెలిపాయి. దాంతో వెంటనే అప్రమత్తమైన సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ పరికరాలపై ఆంక్షలు విదించారు.