: కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చూపుతారా?: బీహార్ ప్రభుత్వానికి మోదీ సవాల్
బీహార్ ఎన్నికల ముందస్తు ప్రచారంలో భాగంగా భాగల్ పూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం మీ రాష్ట్రాభివృద్ధి కోసం రూ.3.76 లక్షల కోట్లు ఇచ్చిందని, వాటిలో రూ.2.70 లక్షల కోట్లకు మాత్రమే లెక్కలున్నాయని అన్నారు. మిగతా రూ.1.06 లక్షల కోట్లు ఏమయ్యాయి? ఎవరు మేశారు? అని సీఎం నితీశ్ కుమార్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. "భాగల్ పూర్ నుంచి నేను సవాల్ విసురుతున్నా. నా పదవీకాలం ముగిసేలోగా ఐదేళ్లలో ఏయే పనికి ఎంతెంత ఖర్చు చేశామో పైసా సహా లెక్క చూపుతాం. అదే పనిని ప్రస్తుత బీహార్ ప్రభుత్వం చెయ్యగలదా?... కేంద్రం ఇచ్చిన నిధుల్లో పెద్ద మొత్తానికి ఇక్కడి పాలకులు లెక్కలు చూపడంలేదు. అంటే ఏమిటి అర్థం? ఆ డబ్బు ఎవరు మేశారు?" అని మోదీ నిలదీశారు.