: దుబాయ్ తాజ్ ప్యాలెస్ ను వదులుకున్న టాటా గ్రూప్
దాదాపు 14 సంవత్సరాల క్రితం టేకప్ చేసిన దుబాయ్ తాజ్ ప్యాలెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ నిర్వహణ బాధ్యతలను వదులుకుంటున్నట్టు టాటా గ్రూప్ వెల్లడించింది. సోమవారం నాడు తాజ్ ప్యాలెస్ ను తిరిగి దాని యజమాని జుమా అల్ మజీద్ గ్రూప్ కు అప్పగించినట్టు టాటా గ్రూప్ ప్రకటించింది. దుబాయ్ లోని డెయిరా ప్రాంతంలో ఉన్న ఈ హోటల్ బాధ్యతలను 2001 నుంచి టాటా గ్రూప్ చూస్తోంది. దుబాయ్ లో అన్ని రకాల భారతీయ రుచులనూ అందించే స్టార్ హోటళ్లలో తాజ్ కు ఎంతో పేరుంది. దేశం నుంచి వెళ్లే సినీ యూనిట్లకు, ప్రముఖులకు, వీఐపీలకు ఎంతో మందికి ఆతిథ్యమిచ్చింది. కాగా, టాటా గ్రూప్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 61 నగరాల్లో 96 హోటళ్లను నిర్వహిస్తోంది. ఇండియాతో పాటు ఉత్తర అమెరికా, బ్రిటన్, ఆఫ్రికా, శ్రీలంక, మలేషియా, మాల్దీవులు, భూటాన్ తదితర దేశాల్లో తాజ్ హోటళ్లు ఉన్నాయి.