: నానా పటేకర్ కోపిష్ఠి...అయినా నన్ను కొడుకులా చూసుకుంటారు: జాన్ అబ్రహాం
బాలీవుడ్ సహజ నటుడు నానా పటేకర్ కు కోపం ఎక్కువని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహాం తెలిపాడు. వీరిద్దరూ కలిసి నటించిన 'వెల్ కం బ్యాక్' సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంలో జాన్ మాట్లాడుతూ, నానా కోపిష్ఠి అయినప్పటికీ తనను సొంత కొడుకులా చూసుకుంటాడని అన్నాడు. ఉన్నదున్నట్టు మాట్లాడడం నానా ప్రత్యేకత అని తెలిపిన జాన్, మనసులో ఉన్నది నిర్మొహమాటంగా బయటపెట్టేస్తారని చెప్పాడు. నిజాయతీగా ఉంటారని నానాను కీర్తించాడు. పారదర్శకంగా నటిస్తారని, నానాతో కలిసి నటించడం సంతోషం కలిగిస్తుందని జాన్ అబ్రహాం తెలిపాడు. ఈ సినిమాలో వీరిద్దరితోపాటు అనిల్ కపూర్, శ్రుతిహాసన్, పరేష్ రావల్ ఇందులో నటించారు. 'వెల్ కం' సినిమాకు సీక్వెల్ గా 'వెల్ కం బ్యాక్' రూపొందింది.