: ప్రత్యేక హోదాపై తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం... ఏపీ శాసనసభ రేపటికి వాయిదా


ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈ రోజు ప్రత్యేక హోదాపై సీఎం ప్రకటన ముగియగా, వెంటనే ఆ అంశంపై చర్చ జరిగింది. పలువురు సభ్యులు ప్రత్యేక హోదాపై సుదీర్ఘంగా మాట్లాడారు. తరువాత హోదాపై తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించినట్టు స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రకటించారు. పన్ను రాయితీలు, రాజధాని నిర్మాణానికి నిధులు, 13 కేంద్రీయ విద్యా సంస్థల స్థాపన, సెక్షన్-8 అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని తీర్మానంలో కోరారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అలాగే శాసనమండలి కూడా రేపటికి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News