: 'పెట్రో' ధరల తగ్గింపు తరువాత భారతీయులకు మరో శుభవార్త చెప్పిన చమురు కంపెనీలు


ప్రపంచ చమురు మార్కెట్లో తగ్గుతున్న ధరలకు అనుగుణంగా, గడచిన ఆగస్టు నెలలో మూడుసార్లు 'పెట్రో' ఉత్పత్తుల ధరలను తగ్గించిన చమురు కంపెనీలు నేడు మరో శుభవార్తను తెలిపాయి. సబ్సిడీ రహిత వంట గ్యాస్ సిలిండర్ పై రూ. 25.50 మేరకు ధర తగ్గించినట్టు వెల్లడించాయి. ఈ తగ్గిన ధర తక్షణం అమల్లోకి వచ్చినట్టని వివరించాయి. ఈ మార్పు తరువాత ఢిల్లీలో రూ. 585గా ఉన్న 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 559.50కి తగ్గింది. ఇదే సమయంలో విమాన ఇంధన ధరలను రూ. 11.7 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. కాగా, జూలై 1న రూ. 18, ఆపై ఆగస్టు 1న రూ. 23.50 మేరకు సిలిండర్ ధరలు తగ్గిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News