: నేనా... ఔట్ డేటెడా... నెవర్!: జగన్ వ్యాఖ్యలకు బాబు కౌంటర్
ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా వైకాపా నేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. "ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఔట్ డేటెడ్ అయిపోయారు. ఎప్పుడో పాత గణాంకాలు మాత్రమే ఆయన చదువుకొని వచ్చారు. వాటిని ఇప్పుడు మనం వినాలా? ఇదంతా సభ్యుల ఖర్మ" అని వ్యాఖ్యానించగా, చంద్రబాబు స్పందించారు. "జగన్ మోహన్ రెడ్డి గారు తానేదో, నేటి తరానికి ప్రతినిధినని అనుకుంటున్నారు. నన్ను ఔట్ డేటెడ్ అంటున్నారు. నేనా..? నెవర్... తానేదో ప్రపంచం అంతా తిరిగానని, తెలివిగల వాడినని ఆయన భ్రమ పడుతున్నారు. చదువుకోమని విదేశాలకు పంపితే తిరుగు టపాలో వెనక్కి వచ్చారు... ఇవన్నీ వదిలిపెట్టండి. డొంక తిరుగుడు వద్దు. మీ దగ్గరేదైనా సమాచారం ఉంటే ఇవ్వండి. అది సరైనదే అయితే తప్పకుండా స్వీకరిస్తాం" అని కౌంటర్ ఇచ్చారు.