: ఇషాంత్, చండిమాల్, తిరిమానే, ప్రసాద్ లపై ఐసీసీ సీరియస్
భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టెస్ట్, నాలుగో రోజు ఆటలో భాగంగా, సంయమనాన్ని మరచి వాగ్వాదానికి దిగిన నలుగురు ఆటగాళ్ల ఉదంతాన్ని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సీరియస్ గా తీసుకుంది. భారత బౌలర్ ఇషాంత్ శర్మ, శ్రీలంక ఆటగాళ్లు చండిమాల్, తిరిమానే, దమ్మిక ప్రసాద్ లపై క్రమశిక్షణా చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది. నిన్న ఇషాంత్ శర్మకు లంక బౌలర్ దమ్మిక ప్రసాద్ వరుసగా బౌన్సర్లు వేయడం, ఆపై ఇషాంత్ మరో బౌన్సర్ వేయమంటూ, తల చూపించడం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని ఐసీసీ అధికారులు పేర్కొన్నారు.