: శ్రీలంక నేవీ అదుపులో 16 మంది తమిళ మత్స్యకారులు


తమిళనాడుకు చెందిన 16 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ సిబ్బంది అరెస్టు చేశారు. ఈ రోజు వారంతా లంక ప్రాదేశిక జలాల్లో ప్రవేశించి చేపలు పడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నట్టు శ్రీలంక మత్స్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. వారితో పాటు 3 బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టైన మత్స్యకారులు పుదుకొట్టాయి జిల్లాలోని జగదాపట్టినంకు చెందిన వారని అధికారులు వెల్లడించారు. అయితే సెల్వరాజ్ అనే ఓ మత్స్యకారుడు చనిపోయాడని, అతని మృతదేహం బోటులో ఉండగా గుర్తించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News