: నేను స్టేట్ మెంట్ మాత్రమే ఇస్తే... చర్చ ఉండదు, ఓకేనా?: జగన్ కు చంద్రబాబు సూటి ప్రశ్న


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చ మొదలైంది. నిన్న తాను మధ్యలోనే ఆపేసిన స్టేట్ మెంటును కొనసాగిస్తున్న చంద్రబాబు, స్టేట్ మెంట్ లో ఉన్న విషయాన్ని వదిలేసి చర్చకు వెళ్లడాన్ని వైకాపా అధినేత ఆక్షేపించగా, చంద్రబాబు ఆగ్రహంతో విపక్షాలను తప్పుబట్టారు. తమకిచ్చిన స్టేట్ మెంటులో ఉన్నది చంద్రబాబు చదవడం లేదని జగన్ చెప్పగా, తనకు అన్ని విషయాలూ తెలుసునని, తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన వారు నిబంధనలు తెలుసుకురావాలని అన్న చంద్రబాబు, "నేను స్టేట్ మెంటు మాత్రమే ఇస్తే, ఆపై చర్చకు అవకాశం ఉండదు. కేవలం క్లారిఫికేషన్ మాత్రమే మీరు అడగాల్సి వుంటుంది. ఓకేనా?" అని కోపంగా ప్రశ్నించారు. విభజన జరిగిన తీరును, ఆనాడు ఇచ్చిన హామీలు, ఆపై చట్టం అమలవుతున్న తీరు తదితరాలను పూర్తిగా సభ ముందు ఉంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. సభలో చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడుతున్నట్టు వివరించారు. ప్రస్తుతం అసెంబ్లీలో బాబు ప్రసంగం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News