: 15వ తేదీ వరకూ రైళ్లలో 14,044 అదనపు బెర్తులు, ఏఏ రైళ్లలో అంటే...!
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా, ఈ నెల 15 వరకూ 20 రైళ్లల్లో 14,044 అదనపు బెర్తులు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తిరుపతి, షిర్డీ, ముంబై, త్రివేండ్రం, అమృతసర్, నరసాపూర్, మచిలీపట్నం, వికారాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు వచ్చే రైళ్లలో ఈ సౌకర్యం కల్పిస్తున్నట్టు వివరించింది. స్లీపర్ క్లాసులో 4,320, చైర్ కార్ లో 4,320, త్రీ టైర్ ఏసీలో 3,840, టూ టైర్ లో 1,564 బెర్తులు అదనంగా అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దీంతో పాటు విజయవాడ నుంచి విశాఖకు, విశాఖ నుంచి ధర్మవరం మధ్య 3 నుంచి 13 మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలియజేసింది.