: కన్నడ సీమకు తరలివెళ్లిన తెలుగు చిత్ర ప్రముఖులు


కన్నడ సీమలో జరిగిన ఓ హై ప్రొఫైల్ వివాహానికి తెలుగు చిత్ర ప్రముఖులు తరలి వెళ్లారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కుమార్తె, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మనవరాలు డాక్టర్ నిరుపమ వివాహం డాక్టర్ దిలీప్ తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు పలువురు రాజకీయ ప్రముఖులు, దక్షిణాది చిత్ర సీమ ముఖ్యులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నాగార్జున, హరికృష్ణ, శ్రీకాంత్ తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రులు అనంత్ కుమార్, సదానంద గౌడ, కర్ణాటక రాష్ట్ర మంత్రులు దేశ్ పాండే, శివకుమార్ తదితరులు వివాహ మహోత్సవానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News