: ‘సూది’గాడి కోసం వేట ముమ్మరం... పశ్చిమగోదావరి జిల్లాలో 15 చెక్ పోస్టుల ఏర్పాటు
సిరంజీ దాడులతో బెంబేలెత్తిస్తూ, తప్పించుకు తిరుగుతున్న సైకో కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు. దారిన ఒంటరిగా కనిపించే వారిపై క్షణకాలంలో సూది దాడి చేసి పరారవుతున్న సైకో దాడులతో పశ్చిమగోదావరి జిల్లా సహా పరిసర జిల్లాల్లో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సైకోను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు అతడి ఊహాచిత్రాన్ని విడుదల చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో నిన్న సైకో మళ్లీ దాడులు చేసి కలలకం రేపాడు. ఈ క్రమంలో సైకోను అరెస్ట్ చేసేందుకు పక్కా ప్రణాళికను రూపొందించిన పోలీసులు జిల్లావ్యాప్తంగా 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భీమవరం, తణుకు, పాలకొల్లుల్లో పోలీసులు ప్రతి ఇంటికి తిరుగుతూ సైకో కోసం జల్లెడ పడుతున్నారు.