: ఇక ‘ఇన్ ఫినిట్ అనలిటిక్స్’ వంతు... రతన్ టాటా పెట్టుబడులతో విస్తరణ బాటలో కంపెనీ


టాటా సన్స్ గ్రూపు చైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా తన ‘వ్యక్తిగత’ పెట్టుబడులను మరింతగా విస్తరిస్తున్నారు. టాటా గ్రూపు బాధ్యతలు సైరస్ మిస్త్రీకి అప్పగించిన రతన్ టాటా, ఇటీవలి కాలంలో చిన్న కంపెనీలపై అమితాసక్తి చూపుతున్నారు. ఇప్పటికే స్నాప్ డీల్, కార్యా, అర్బన్ ల్యాడర్, బ్లూస్టోన్, కార్ దేఖో, షామి, ఓలా తదితర కంపెనీల్లో వ్యక్తిగత హోదాలో పెట్టుబడులు పెడుతూ వస్తున్న ఆయన తాజాగా నిన్న మరో చిన్న కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ప్రెడెక్టివ్ టెక్నాలజీ రంగంలో మెరుగైన పనితీరు కనబరుస్తున్న ‘ఇన్ ఫినిట్ అనలిటిక్స్’లో ఆయన వాటా కొనుగోలు చేశారు. రతన్ టాటాతో పాటు మరికొందరు పారిశ్రామికవేత్తలు తమ కంపెనీలో పెట్టుబడి పెట్టినట్లు ఇన్ ఫినిటీ అనలిటిక్స్ వెల్లడించింది. అయితే రతన్ టాటా ఎంతమేర పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని మాత్రం ఆ కంపెనీ వెల్లడించలేదు. కొత్తగా అందిన నిధులతో కంపెనీని మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కంపెనీ పేర్కొంది.

  • Loading...

More Telugu News