: రూ.1కే సెల్ చార్జింగ్... ‘పే చార్జర్’ బాక్సును రూపొందించిన తెలుగు తేజం


సెల్ ఫోన్ చార్జింగ్ కోసం తెలుగు విద్యార్థి ఒకరు వినూత్న పరికరాన్ని రూపొందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అనంతపురంలోని జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్న విద్యార్థి సాయికృష్ణ ‘పే చార్జర్’ పేరిట సరికొత్త బాక్సును రూపొందించాడు. ఈ బాక్సులో కేవలం రూ.1 వేయడం ద్వారా సెల్ ఫోన్ ను ఐదు నిమిషాల పాటు చార్జింగ్ చేసుకోవచ్చు. ‘పే చార్జర్ కాయిన్ బాక్సు’ పేరిట రూపొందించిన ఈ కొత్త పరికరాన్ని నిన్న జేఎన్టీయూ వీసీ సుదర్శనరావు ఆవిష్కరించారు. స్థానికంగా లభించే పరికరాలతోనే సాయికృష్ణ ఈ కాయిన్ బాక్సును రూపొందించడం విశేషం.

  • Loading...

More Telugu News