: మణిపూర్ లో మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు


మణిపూర్ లో హింస రాజుకుంటోంది. ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై నేటి సాయంత్రం నుంచి జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు దక్షిణ మణిపూర్ లోని చురచంద్ పూర్ లో ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పుపెట్టారు. మణిపూర్ ఆరోగ్యశాఖ మంత్రి పుంగ్ జతాంగ్ టాన్సింగ్ ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఘటనలో నెలకొన్న తాజా పరిస్థితులపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News