: స్పోర్ట్స్ బైక్ పై నుంచి కిందపడి, గాయపడ్డ గల్లా జయదేవ్
టీడీపీ యువ ఎంపీ గల్లా జయదేవ్ బైక్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డారు. గుంటూరు శివార్లలోని బైకుల షోరూంకు కుమారుడికి స్పోర్ట్స్ బైక్ కొనేందుకు వెళ్లిన గల్లా జయదేవ్, హెల్మెట్ ధరించి టెస్ట్ డ్రైవ్ కు వెళ్లారు. డ్రైవ్ సందర్భంగా బైక్ వేగం, నాణ్యత పరీక్షించే క్రమంలో వేగంగా వెళ్లిన జయదేవ్ బండి వేగాన్ని కంట్రోల్ చేయలేక కిందపడ్డారు. దీంతో ఆయన కాళ్లు, చేతులు, నడుం భాగాలకు గాయాలైనట్టు సమాచారం. వెంటనే ఆయనను హుటాహుటీన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఎంపీకి ఎలాంటి ప్రమాదం లేదని, రెండు మూడు వారాల విశ్రాంతి అవసరం ఉంటుందని సమాచారం. కాగా, గల్లాను పరామర్శించేందుకు గుంటూరు నుంచి ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు బయల్దేరారు.