: థాయ్ లాండ్ లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు దగ్గరైన యోగా!
యోగాకు, స్మార్ట్ ఫోన్ కు సంబంధం ఏంటని అనుకుంటున్నారా?...ఇకపై యోగా నేర్చుకోవాలంటే గురువు ఉండాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంటే చాలు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యాప్ ను థాయ్ లాండ్ లో భారత రాయబారి హర్షవర్థన్ శ్రింగాలా మొబైల్ యోగా యాప్ ను ఆవిష్కరించారు. ఈ యాప్ త్వరలోనే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా ఔత్సాహికులు ఇంగ్లిష్, హిందీ, థాయ్ భాషల్లో యోగాసనాలు నేర్చుకోవచ్చని ఈ సందర్భంగా శ్రింగాలా వెల్లడించారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ను ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, ల్యాప్ టాప్ లలో వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఐఓఎస్, విండోస్ వెర్షన్లను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన చెప్పారు.