: భూమిపై అంగారకుడు...అందులో ఆరుగురు పరిశోధకులు!


అంగారకుడిపై మనిషి నివాసానికి సంబంధించిన పరిశోధనలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ముందుగా భూమిపైనే అచ్చం అంగారకుడిపై ఉండే స్థితిగతులను నాసా కృత్రిమంగా సృష్టించింది. అమెరికాలోని హవాయి ద్వీపంలో నాసా ఒక డూమ్ ఏర్పాటు చేసింది. అందులో అచ్చం అంగారకుడిపై ఉండే వాతావరణ పరిస్థితులను కల్పించింది. అలాగే అందులోకి ఆరుగురు వ్యోమగాములను ఆగస్టు 28న పంపించింది. ఫ్రెంచ్ ఆస్ట్రో బయాలజిస్ట్, జర్మన్ భౌతిక శాస్త్రవేత్త, నలుగురు అమెరికన్లను (పైలట్, ఆర్కెటిక్ట్, డాక్టర్, మట్టిపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్త) పంపించారు. ఈ డూమ్ ఆరు మీటర్ల ఎత్తు, 11 మీటర్ల వ్యాసార్థంతో ఉంటుంది. అందులో ఆరుగురికీ ఆరు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఈ గదుల్లో బెడ్, పని చేసుకునేందుకు డెస్క్ ఏర్పాటు చేశారు. వీరిని ఏడాదిపాటు ఇందులోనే ఉంచి పరీక్షించి అనంతరం వారిని అంగారకుడిపైకి పంపనున్నారు. డూమ్ లోంచి బయటకు రావాలంటే స్పేస్ సూట్ ధరించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News