: ఎయిర్ హోస్టెస్ ను వీడియో తీసి చిక్కుల్లో పడ్డ యువకుడు!
ఓ యువకుడి అత్యుత్సాహం అతడిని చిక్కుల్లో పడేసింది. అదిలాబాద్ కు చెందిన ప్రణవ్ అనే యువకుడు అహ్మదాబాద్ నుంచి హైదరాబాదుకు విమానంలో ప్రయాణించాడు. ఈ సందర్భంగా ప్రణవ్ విమానంలో విధులు నిర్వర్తించే ఎయిర్ హోస్టెస్ ను వీడియో తీశాడు. అతని ప్రయత్నాన్ని గమనించిన ఎయిర్ హోస్టెస్ అభ్యంతరం చెప్పినా ప్రణవ్ వినిపించుకోలేదు. దీంతో సదరు ఎయిర్ హోస్టెస్ శంషాబాదు ఎయిర్ పోర్టులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రణవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.