: 24 గంటల్లోనే తిరిగి చెల్లిస్తామంటున్న ఫ్లిప్ కార్ట్


ఆన్ లైన్ వ్యాపార సంస్థ ఫ్లిప్ కార్ట్ ఇకపై 24 గంటల్లో వాపస్ చేసిన వస్తువుల డబ్బులు చెల్లిస్తామంటూ హామీ ఇస్తోంది. ఆన్ లైన్ వ్యాపారం రోజురోజుకీ విస్తృతమవడంతో వినియోగదారులకు మరింత దగ్గరయ్యేందుకు ఆన్ లైన్ వ్యాపార సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో అత్యంత త్వరగా డెలివరీ ఇస్తాం అంటూ ఆన్ లైన్ వ్యాపార సంస్థలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అదే క్రమంలో ఆన్ లైన్ వ్యాపార సంస్థలు అందించే వస్తువుల నాణ్యత, ధరల విషయంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాక, వస్తువు వాపస్ చేస్తే, తమకు రావలసిన మొత్తం కోసం వినియోగదారులు నాలుగు రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వినియోగదారులు మరో సంస్థకు మరలిపోతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులను ఆకట్టుకోవడానికి, ఇలాంటి సమస్యను 24 గంటల్లో పరిష్కరించేందుకు ఫ్లిప్ కార్ట్ నూతన యంత్రాంగాన్ని నియమించింది. వస్తువు వాపస్ చేస్తే కేవలం 24 గంటల్లోనే చెల్లించిన రుసుంను వెనక్కి చెల్లిస్తామని చెబుతోంది.

  • Loading...

More Telugu News