: వాహనదారులకు శుభవార్త...తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వాహనదారులకు శుభవార్త వినిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన క్రూడాయిల్ ధరల కారణంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెట్రోలుపై రెండు రూపాయలు, డీజిల్ పై 50 పైసలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, భారత్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులు సమావేశమై తాజా నిర్ణయం ప్రకటించారు. తగ్గిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమలు కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు కిందికి రావడంతో పెట్రోలు 2 రూపాయలు, డీజిల్ 50 పైసలు తగ్గింది. భారీ తగ్గింపు ఉంటుందని భావించిన నిపుణుల అంచనాలను తల్లికిందులు చేస్తూ, డీజిల్ పై 50 పైసలు మాత్రమే తగ్గించడం విశేషం.