: ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. బదిలీల విధివిధానాలపై జీవో నెం.63ను ఈరోజు విడుదల చేసింది. బదిలీల ప్రక్రియకు ఆన్ లైన్ అవకాశం కల్పించింది. గ్రేడ్-2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్స్, ఎస్ జీటీ ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, కౌన్సెలింగ్ పద్ధతిలో బదిలీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బదిలీలకు జిల్లా స్థాయి, జోన్ల స్థాయి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.