: శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలనుంది: కరీనా కపూర్


భారత శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలనుందని కరీనా కపూర్ ఆకాంక్ష వ్యక్తం చేసింది. తన సోదరి కరిష్మా కపూర్ కు, తనకు చిన్నప్పటి నుంచి భరతనాట్యం, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవాలని ఉండేదని, అయితే సినిమాల్లో బిజీగా ఉండడంతో ఆ కోరిక నెరవేరలేదని తెలిపింది. ఎప్పటికైనా శాస్త్రీయ నృత్యం నేర్చుకుని తీరుతానని కరీనా వెల్లడించింది. ఆధునిక ఫ్యాషన్ ను కూడా ఇష్టపడతానని కరీనా చెప్పింది. అయితే, చీర అందం దేనికీ రాదని అభిప్రాయపడింది. కాగా, ప్రస్తుతం ఆర్ బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కీ అండ్ కా' సినిమాలో అర్జున్ కపూర్ సరసన కరీనా నటిస్తోంది.

  • Loading...

More Telugu News