: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ విడుదల
గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ విడుదల చేసింది. 90 మంది అధ్యాపకులు నెల పాటు శ్రమించి సిలబస్ తయారు చేశారని కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి సిలబస్ విడుదల అనంతరం తెలిపారు. అన్ని వర్సిటీల ప్రొఫెసర్లను సంప్రదించి సిలబస్ రూపొందించినట్టు చెప్పారు. గ్రూప్స్ తో పాటు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు, ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్లకు సిలబస్ రూపొందించినట్టు పేర్కొన్నారు. సిలబస్ ను ఈ రోజు నుంచి టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు. సిలబస్ రూపొందించిన ప్రొఫెసర్లకు కమిషన్ ఛైర్మన్ ధన్యవాదాలు తెలిపారు. సిలబస్ లో తెలంగాణ చరిత్ర పొందుపరిచామని వివరించారు.