: గుజరాత్ నుంచి యూపీకి పాకిన పటేల్ ఉద్యమం ...యూపీలో ర్యాలీకి పిలుపు


గుజరాత్ లో పటేల్ కులస్తులకు ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించి దేశంలో ఆసక్తికరమైన చర్చకు తెరతీసిన హార్దిక్ పటేల్, ఈ నిరసనలను యూపీకి పాకించేందుకు సమాయత్తమవుతున్నాడు. యూపీ రాజధాని లక్నోలో భారీ ర్యాలీకి హార్దిక్ పటేల్ పిలుపునిచ్చాడు. దేశంలో ఉండే పటేళ్లందరికీ తాను అండగా ఉంటానని హార్దిక్ పటేల్ సూచించాడు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా దేశమంతా ఉన్న పటేల్ కులానికి తాను అండగా నిలుస్తానని హార్దిక్ పటేల్ ప్రకటించాడు. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ లో ర్యాలీ జరపనున్నానని చెప్పాడు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న పేదలందరికీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తానని ఆయన తెలిపాడు.

  • Loading...

More Telugu News