: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట... కీలక ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు ఈ కేసు విచారణను చేపట్టిన హైకోర్టు... ఎల్లుండిలోగా సంస్థకు ఉన్న ఆస్తులు, కంపెనీ వివరాలను వెల్లడించాలని అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అదే విధంగా అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థల వివరాలను తెలపాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు, కేసు విచారణ పూర్తి అయ్యేంత వరకు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మమని ప్రమాణ పత్రాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో ఇంతవరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. అనంతరం కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.