: లంక పతనం మొదలు... 2/2
దాదాపు మూడు దశాబ్దాల తరువాత శ్రీలంక గడ్డపై టెస్టు సిరీస్ విజయం సాధించే దిశగా, కీలకమైన నాలుగో ఇన్నింగ్స్ లో భారత్ తొలి అడుగు వేసింది. 386 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టులో ఓపెనర్ ఉపుల్ తరంగ డక్కౌట్ అయ్యాడు. తొలి ఓవర్ ఆరవ బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో ఓజాకు క్యాచ్ ఇచ్చాడు. తరంగ అవుటైన తరువాత వన్ డౌన్ బ్యాట్స్ మెన్ గా కరుణరత్నే బరిలోకి దిగాడు. కరుణరత్నే సైతం డక్కౌట్ కావడంతో ఆదిలోనే లంక కష్టాల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం లంక స్కోరు 3.3 ఓవర్లలో 2/2. ఇషాంత్ శర్మ దాదాపు 142 కి.మీ సరాసరి వేగంతో బంతులు విసురుతుండటంతో, వాటిని ఎదుర్కోవడానికి లంక ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నట్టు కనిపిస్తోంది.