: జగన్ లాంటి వాళ్లను చాలా మందిని చూశా... గీత దాటితే సహించను: చంద్రబాబు హెచ్చరిక


ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయాలని చూసే జగన్ లాంటి వాళ్లను తాను చాలా మందిని చూశానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం అసెంబ్లీ వాయిదా పడ్డ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత ప్రతి అంశాన్నీ వివాదాస్పదం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ గీత దాటితే సహించబోనని హెచ్చరించారు. పుష్కర ఘాట్ లో జరిగిన తొక్కిసలాటకు తాను ఇప్పటికీ బాధపడుతున్నానని అన్నారు. ఆరోజు ఏ ప్రభుత్వమూ స్పందించనంత వేగంగా స్పందించానని తెలిపారు. జగన్ మంచి సలహాలు ఇస్తే హర్షించి ఉండేవాడినని, కానీ వాస్తవానికి అలా జరగడం లేదని, ఇది రాష్ట్రమంతటికీ దురదృష్టకరమని ఆయన అన్నారు. కంచి పీఠాధిపతి పుష్కర ఘాట్ లో ఉండబట్టే తాను కూడా అక్కడికే వెళ్లాను తప్ప మరే ఇతర కారణాలూ లేవని స్పష్టం చేశారు. సంతాప తీర్మానాలను కూడా రాజకీయం చేయాలని చూడటం సరైన పరిణామం కాదని అన్నారు. అన్ని అంశాలపై చర్చల సమయంలో తగిన సమాధానం చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వివరించారు. జగన్ పదే పదే రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటం సరికాదని, అది ఆయన అపరిపక్వతకు నిదర్శనమని విమర్శించారు.

  • Loading...

More Telugu News