: మహిళా కౌన్సిలర్ ను వీడియో తీసిన తెలుగుదేశం కౌన్సిలర్!.. పొన్నూరులో వైకాపా నిరసన


వైకాపాకు చెందిన మహిళా కౌన్సిలర్ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, ఆమెను వీడియో తీశాడని ఆరోపిస్తూ, పొన్నూరు మునిసిపల్ కార్యాయలంలో ఆ పార్టీ సభ్యులు నిరసనకు దిగారు. తనను వీడియో తీస్తుండటాన్ని గమనించిన ఆ మహిళా కౌన్సిలర్, ఎందుకు అలా చేస్తున్నారని ప్రశ్నించగా, టీడీపీ కౌన్సిలర్ దురుసుగా వ్యవహరించాడని వైకాపా నేతలు విమర్శించారు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించిన కౌన్సిలర్ ను ప్రశ్నించడానికి వెళితే, తమపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ మేరకు మునిసిపల్ సమావేశ మందిరంలో బైఠాయించిన వైకాపా నేతలు, దేశం కౌన్సిలర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News