: ఐఎస్ చెరలో ఉన్న తెలుగువారు క్షేమమే: విదేశాంగ శాఖ


లిబియాలో ప్రొఫెసర్లుగా పని చేస్తున్న ఇద్దరు తెలుగు వ్యక్తులను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగి నెల రోజులు గడిచిపోయినప్పటికీ... వారు ఇంకా విడుదల కాలేదు. వారి పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో, వారిద్దరూ క్షేమంగానే ఉన్నారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. లిబియాలోనే పరిస్థితి సరిగా లేదని... తిరుగుబాటుదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఐఎస్ చెరలో బందీలుగా ఉన్న తెలుగువారి విడుదలకు మార్గం సుగమం కాలేదని ఆయన స్పష్టం చేశారు. లిబియాలో భారత్ కు రాయబార కార్యాలయం కూడా లేదని... అందువల్ల మూడో వ్యక్తి ద్వారా వీరిద్దరి విడుదలకు యత్నిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News