: హైదరాబాదులో 'హిటాచి' సెంటర్ ప్రారంభం


హైదరాబాదులోని గచ్చిబౌలిలో హిటాచి సొల్యూషన్స్ గ్లోబల్ డెవలప్ మెంట్ సెంటర్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. టీఎస్ మంత్రి కేటీఆర్ ఈ రోజు హిటాచి సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, నగరంలో హిటాచీ కార్యకలాపాలు ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు 35 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని... మరో 15 కంపెనీలకు అనుమతులు ఇవ్వబోతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే చైనాలో పర్యటించనున్నారని... తాను జపాన్ లో పర్యటించనున్నానని వెల్లడించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని చెప్పారు.

  • Loading...

More Telugu News